కారేపల్లి, అక్టోబర్ 7: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర మంగళవారంతో ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి వారం రోజులపాటు కోట మైసమ్మ జాతర నిరంతరాయంగా జరిగింది. లక్షలాదిమంది భక్తులు తరలి రావడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ముందస్తు ప్రణాళికలు రూపొందించి జాతర సజావుగా జరిగేందుకు ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా పర్స ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించారు.
ఖమ్మం రూరల్ ఏసిపి బీ.తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో 150 మంది పోలీస్ సిబ్బంది జాతరలో విధులు నిర్వహించారు .ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జాతర ముగిసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పర్స ట్రస్ట్, దేవాలయ చైర్మన్ పర్స పట్టాభి రామారావు,దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఈ. వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహణాధికారి వేణుగోపాలచార్యులు కృతజ్ఞతలు తెలిపారు.