ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగా రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు సానబోయిన శ్రీనివాస్ మరణించారు. మరోవ్యక్తితో కలిసి ఖమ్మం నగరానికి వెళ్లిన ఆయన.. గురువారం అర్ధరాత్రి తిరిగి తమ ఇంటికి బైక్పై బయలుదేరారు. క్రమంలో సత్యనారాయణపురం పాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన డీసీఎం వారిని ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు.
మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యలోనే శ్రీనివాస్ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.