తల్లాడ, మార్చి 4: రాష్ట్రంలో మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన అందిస్తున్నారని అన్నారు. ఆయన అమలు చేస్తున్న పథకాలన్నీ దేశానికి తలమానికంగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. తల్లాడ మండలంలోని కేశవాపురం, ముద్దునూరు, కుర్నవల్లి, బస్వాపురం, రామానుజవరం, లక్ష్మీపురం గ్రామాల్లో శనివారం పర్యటించిన ఆయన.. రూ.1.70 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలనూ అగ్రభాగాన నిలపడంతో ఎమ్మెల్యే సండ్ర చేస్తున్న కృషి ఎంతో గొప్పదని అన్నారు. నిత్యం ప్రజలతో మమేకయ్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ప్రతి సమస్యనూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో ముందుంటారని గుర్తుచేశారు.
అనంతరం ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. రూ.6 కోట్లతో కుర్నవల్లి – ఉమ్మడదేవరపల్లి, రూ.2.10 కోట్లతో కుర్నవల్లి – పుణ్యపురం రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంత ప్రజల చిరకాల కాంక్షను నెరవేర్చామన్నారు. బస్వాపురం – పెద్దకోరుకొండి, నారాయణపురం – రెడ్డిగూడెం మధ్య కూడా త్వరలో బీటీ రోడ్లు ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు గంటా శ్రీలత, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, నల్లమల వెంకటేశ్వరరావు, వెంకట్‌లాల్, రవీందర్‌రెడ్డి, శ్రీదేవి, సురేష్, రాంబాబు, అశోక్, లక్ష్మి, అలేఖ్య, లక్ష్మీనారాయణ, రేణుక, కోటారెడ్డి, సీతారామిరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, కళావతి, వెంకటేశ్వర్లు, పద్మావతి, శివపార్వతి, వెంకటేశ్వర్లు, కిరణ్‌బాబు, కృష్ణప్రసాద్, వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు.