Khammam | ఖమ్మం రూరల్: ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే నలుగురికి వేర్వేరు పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికలు వచ్చినప్పుడు భర్త ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తే.. భార్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి. పిల్లలు మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. ఇది ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని 23వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలోని ఓటర్ల దుస్థితి. ఈ సమస్య గురించి సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. సాంకేతిక, ఇతరత్రా కారణాలను చూపిస్తూ ఈ సమస్యను అలాగే పెండింగ్‌లో పెట్టేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఓటర్ల దుస్థితి ఇలా ఉంది. 2008 సంవత్సరంలో నాటి ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలను గుర్తించి ఇళ్ల స్థలాలను అందించడంతోపాటు పక్క గృహాలను సైతం నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందజేసింది. అప్పట్లో ఈ కాలనీ పెద్దతండా పంచాయతీ పరిధిలో ఉండే. గత సంవత్సరం ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటుకావడంతో సత్యనారాయణపురం, సాయినగర్, ఇందిరమ్మ కాలనీలను కలిపి 23వ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నూతనంగా ఏర్పాటైన ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే ప్రజలు జలగం నగర్, నాయుడుపేట, ఏదులాపురం ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా తమ ఓటును 23వ డివిజన్‌కు మార్చుకోవడం కోసం దరఖాస్తులు కూడా చేసుకున్నారు. అయితే వారి ఓటును బదిలీ చేసే సమయంలో బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక కుటుంబంలోని నలుగురు ఓటర్లు తమ ఓటును మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు.. వారందరికీ ఒకే పోలింగ్ బూత్ ఇవ్వాల్సిందిపోయి.. ఒక్కొక్కరికీ ఒక్కో బూత్‌ను కేటాయించారు. ఇందిరమ్మ కాలనీకి మార్చుకున్న ఓట్లను అక్కడి సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ క
ప్రస్తుతం ఇందిరమ్మ కాలనీలో సుమారు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉండటంతో ఇప్పటికైనా సంబంధిత ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని, తమ కాలనీలోని వారందరినీ ఓకే పోలింగ్ కేంద్రానికి అనుసంధానించాలని కోరుతున్నారు. లేదంటే సమీప అంగన్వాడీ కేంద్రంలో మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.