చండ్రుగొండ, అక్టోబర్23: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. తాటి సుబ్బన్నగూడెంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం రావికంపాడుకు చెందిన 250 కుటుంబాలు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భూపతి రమేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరాయి. ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో గానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, పార్టీ నాయకులు ఉప్పతల ఏడుకొండలు, రసూల్, భూపతి శ్రీనివాసరావు, లక్ష్మణ్‌రావు, రవి, పుల్లయ్య, మల్లికార్జునరావు, వెంకటేశ్, సర్పంచ్ రన్యా పాల్గొన్నారు.