ములకలపల్లి, మార్చి 9: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడంపై కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ఉపాధ్యక్షుడు మైలగాని చంద్రమౌళి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా చాలీచాలని జీవితాలతో వెట్టిచాకిరీ చేస్తున్న తమను కేసీఆర్ గుర్తించి మా ఉద్యోగాలను రెగ్యూలర్ చేశారని, మా కుటుంబాలు కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నర్సింహారావు, కుమార్, రాజేశ్వరి, రామకృష్ణ, సుచరిత, శేషు, సుధాకర్ పాల్గొన్నారు.
టేకులపల్లి, మార్చి 9: నిరుద్యోగులు, యువజన నాయకుల ఆధ్వర్యంలో వేర్వేరుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్‌గౌడ్, ఎంపీపీ భూక్యా రాధ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. బోడ సరిత, మాలోత్ రాజేందర్‌నాయక్, కంభంపాటి చంద్రశేఖర్‌రావు, బానోత్ రామానాయక్, కిషన్ నాయక్, సైదులునాయక్, పూల్సింగ్నాయక్, శ్రీనివాస్‌రాజు, శివకృష్ణ, అప్పారావు, బాలకృష్ణ, రాజా పాల్గొన్నారు.
టేకులపల్లి, మార్చి 9: కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధ్దీకరిస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వారు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. కె.బసవమ్మ, బి.సత్యవతి, డి.వేణుగోపాల్, ముంతాజ్ అలీ, యాఖుబ్, వరలక్ష్మి, శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, మార్చి 9: సీఎం కేసీఆర్ ఒక లెజెండ్ అని కాంట్రాక్ట్ లెక్చరర్లు కొనియాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోర్తిజాన్ మాట్లాడారు. వీరభద్రం, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మణ్, జగదీశ్వర్, రఘు, శైలజ, సోమేశ్వరరావు, విలియం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ, మార్చి 9: నిరుద్యోగులు పాలిట దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కమిటీ స్పష్టం చేసింది. బుధవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చిత్రపటాలకు మండల కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, నాయకులు గాదె శివప్రసాద్, భూపతి శ్రీనివాస్‌రావు, గుగులోత్ శ్రీనివాస్‌నాయక్, శ్రీనివాస్‌రావు, సూర వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇల్లెందు, మార్చి 9: నిరుద్యోగులు, యువజన నాయకుల ఆధ్వర్యంలో వేర్వేరుగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఇల్లందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువజన టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కార్తీక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 91వేలకు పై చిలుకు ఉద్యోగ నియామకాల గురించి ప్రకటన చేసిన సీఎం కేసీఆర్, 80,039 ఉద్యోగాలకు తక్షణ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులకు సూచించారు. దీంతో పట్టణంలో నిరుద్యోగులు, టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.