ఖమ్మం, అక్టోబర్ 16 : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పు వ్వాడ అజయ్‌కుమార్ అధికారులు, గుత్తేదారులకు సూ చించారు. ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ రామకృష్ణనగర్‌లో రూ. 45 లక్షలు, 33వ డివిజన్ పంపింగ్‌వెల్ రోడ్లో రూ.45 లక్షలతో మొత్తం రూ. 90 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఖమ్మం రాష్ర్టానికే ఆదర్శంగా మారిందన్నారు. రహదారుల అభివృద్ధి చేయడంతో అన్ని ప్రాం తాలు అభివృద్ధి చెందాయని, అనేక ప్రాంతాలు కొత్తగా వ్యాపార కూడల్లుగా మారాయన్నారు. నగరంలో వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఫలితంగా ఖమ్మం రూపు రేఖలు మారాయన్నారు. ప్రస్తుతం నిర్మించే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు దాదె అమృతమ్మ, తోట ఉమారాణి, తోట వీరభధ్రం, పునుకొల్లు రామబ్రహ్మం, షేక్ మక్బుల్ పాల్గొన్నారు.
బాధితులకు భరోసా సీఎంఆర్ఎఫ్.. : మంత్రి పువ్వాడ
అనారోగ్యాల బారిన పడిన నిరుపేదలకు వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్తో భరోసా కల్పిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని క్యాంప్ కార్యాలయంలో 94మందికి మంజూరైన రూ.8.70 లక్షల విలువైన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సుఖ, సంతోషాలతో జీవించేందుకు పలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. దేశంలో సంక్షేమ పథకాల అమలులో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నదని అన్నారు. నిరుపేదలు అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న అనంతరం ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. తన కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పేదలకు సాయం చేయడం జరుగుతుందన్నారు. ఎనిమిదేళ్లలో నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 3743 చెక్కులకు గాను రూ.15.85 కోట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.