పెనుబల్లి, అక్టోబర్ 14 : పెండింగులో ఉన్న పోడుదారుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు అన్నారు. చౌడవరం అటవీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజన ఆవాస ప్రాంతాలను శుక్రవారం సందర్శించి మాట్లాడుతూ పోడు భూముల పట్టాలతో గిరిజన ఆవాస ప్రాంతాల్లో నివాసముంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ధృడనిశ్చయంతో ఉందన్నారు. పోడు సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, సర్పంచ్ శంకర్, బెల్లంకొండ చలపతిరావు, తేళ్లూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల, అక్టోబర్14: సాలెబంజర గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న పోడు భూముల సర్వేను ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. సర్వే వివరాల నివేదికను సంబంధిత ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్ బండారు కృష్ణ, ఎంపీటీసీ తేజావత్ కుమారి, ఫారెస్టు అధికారులు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, షేక్ దాదాసాహెబ్, నాయకులు తేజావత్ మదన్, లకావత్ దేవేందర్, షేక్ జాన్పాషా, బానోత్ రమేశ్, బోడ వెంకన్న, మల్లికార్జునరావు పాల్గొన్నారు. పోడు సర్వేను కాంగ్రెస్ నాయకులు పరిశీలించి రైతులకు అన్యాయం జరగకుండాచూడాలని కోరారు.