చింతకాని, అక్టోబర్ 14: తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, లబ్ధిదారులు పక్కా ప్రణాళికతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. మండల పరిధిలోని నాగులవంచలో శుక్రవారం 10 మంది లబ్ధిదారుల యూనిట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దళితబంధు ఫైలెట్ ప్రజెక్టుగా చింతకాని మండలం ఎంపికై అన్ని గ్రామాల్లో దళితబంధు ఫలాలు అందుతుండడంతో దళితవాడలు కళకళలాడుతున్నాయన్నారు. దశాబ్ధాలు గడచినా మారని దళితుల తలరాతలు… సీఎం కేసీఆర్ పాలనలో దళితబంధు పథకం ద్వారా మారనున్నాయని తెలిపారు. దళితుల సాధికారిత సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అన్నారు. మండల నాయకులు పెంట్యాల పుల్లయ్య, వంకాయలపాటి సత్యనారాయణ, వెంకటలచ్చయ్య, కోల్లి బాబు, నల్లమోతు శేషగిరి, అంబటి వెంకటి, సైదులు, సర్పంచ్ నాగమణి, సుబ్బారావు, వెంకటనర్సయ్య పాల్గొన్నారు.
బోనకల్లు, అక్టోబర్ 14: సీతానాగారం గ్రామానికి చెందిన కటారు నాగేశ్వరరావు తండ్రి లక్ష్మయ్య జ్ఞాపకార్థం శ్రీప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన బోరును జడ్పీ చైర్మన్ కమల్‌రాజు ప్రారంభించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న గుడారు తిరుపతిరావు, లక్ష్మీనర్సమ్మను ఆయన పరామర్శించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు సమితి కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు బంధం శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ బానోత్ కొండ, రైతుసంఘం మండల అధ్యక్షుడు కాకాని శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, యనిగండ్ల మురళి, సూర్యదేవర సుధాకర్, రెడ్డెబోయిన ఉద్దండు, చిలకా నాగరాజు, చిలకా వెంకటేశ్వర్లు, గాదా నర్వోత్తమరెడ్డి, బంధం నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మధిరటౌన్, అక్టోబర్ 14: కొద్ది రోజులుగా ఎల్ఐసీ ఏజెంట్ల డిమాండ్లను పరిష్కారం చేయాలని చేపట్టిన నిరసన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ కమల్‌రాజు శుక్రవారం సంఘీభావం తెలిపారు. కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, అరిగె శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రాఘవరావు, జేవీ.రెడ్డి పాల్గొన్నారు.
మధిరరూరల్, అక్టోబర్ 14: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మండలంలోని కృష్ణాపురం గ్రామంలో బీసీ గురుకులాల్లో జరుగుతున్న క్రీడాపోటీల ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు.