భద్రాచలం, అక్టోబర్ 8: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన బోయపాటి సీతారామాంజనేయులు, బోయపాటి శ్రీమన్నారాయణ రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఆ చెక్కును దేవస్థానం ఈవోకు అందజేశారు. వారు శనివారం ఉదయం రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల్లో పూజలు చేసి, తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమ తల్లిదండ్రులు బోయపాటి వెంకట సుబ్బయ్య, సుబ్బమ్మల జ్ఞాపకార్థం అన్నదానం నిర్వహించాలని కోరుతూ సదరు చెక్కును దేవస్థానం ఈవో బానోత్ శివాజీకి అందజేశారు