తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. అన్ని చోట్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొని ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఖమ్మంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, కొత్తగూడెంలో కలెక్టర్ అనుదీప్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, మధిర, కొత్తగూడెంలలో జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -నెట్వర్క్