రఘునాథపాలెం, సెప్టెంబర్ 19: వృద్ధుడి అదృశ్యంపై ఖమ్మం అర్బన్ ఖానాపురం హవేలీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్-2లో నివాసం ఉండే రంగు రవీంద్రాచారి (65) అనే వృద్ధుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తరువాత తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తమ బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడి భార్య ఇందిర సోమవారం పోలీసులను ఆశ్రయించింది.