ఆదివాసీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని వక్తలు పేర్కొన్నారు. అందుకే వారి రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచారని, ఆత్మగౌరవ భవనాలను నిర్మించారని అన్నారు. అలాగే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీవో జారీ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఇందుకోసం గిరిజనులంతా సీఎం కు రుణపడి ఉంటారని అన్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు ఆదివారం క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రిజర్వేషన్లు పెంచడం, ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వనుండడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీలు, గిరిజనుల ఆరాధ్యదైవమయ్యారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో..
గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పెనుబల్లి మండలంలో వేడుకలు నిర్వహించారు. ఆ మండలంలో ఏర్పడిన నూతన పంచాయతీ సూరయ్యబంజరు తండాలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ భారీ కటౌట్‌కు క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. ‘జయహో కేసీఆర్..’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ దేశంలో కనివినీ ఎరుగని రీతిలో అత్యంత వెనుకబడిన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. – నెట్వర్క్, నమస్తే తెలంగాణ
అన్నపురెడ్డిపల్లి మండలంలో..
అశ్వారావుపేట : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు కాలుస్తున్న కార్యకర్తలు