సత్తుపల్లి టౌన్, సెప్టెంబరు 15 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో జేవీఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి శుక్రవారం నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వల్లభనేని పవన్ గురువారం పిలుపునిచ్చారు. వజ్రోత్సవ ర్యాలీలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ యువకులు, మహిళలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తల్లాడ, సెప్టెంబర్15 : నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన శుక్రవారం జరగబోయే తెలంగాణ వజ్రోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని ఎంపీడీవో శ్రీదేవి అన్నారు. రైతువేదికలో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, స్పెషల్ఆఫీసర్ ఆంజనేయులు, తహసీల్దార్ శ్రీలత, ఎస్సై సురేశ్, సొసైటీ చైర్మన్ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఏవో తాజుద్దీన్ పాల్గొన్నారు.
వేంసూరు, సెప్టెంబర్ 15 : ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే సమైక్యతా వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు కోరారు.ఎంపీడీవో కార్యా లయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో తహసీల్దార్ ఎండీ.ముజాహిద్, ఎంపీడీవో వీరేశం, ఎంపీవో రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైరాటౌన్, సెప్టెంబర్15 : నియోజకవర్గ కేంద్రంలో నేడు నిర్వహించనున్న తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు గురువారం పర్యవేక్షించారు. నేడు సుమారు 15వేల మందితో ర్యాలీ, బహిరంగ సభను నిర్వహిస్తామని, 17న జెండా ఆవిష్కరణ, బంజారా భవన్ మీటింగ్‌కు ప్రజాప్రతినిధులు, బంజారా ప్రతినిధులు హాజరు కావాలన్నారు. ఈ నెల 18న కవులు, కళాకారులు, సమరయోధులను సన్మానిస్తామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.