ఖమ్మం, సెప్టెంబర్ 15 : అన్నివర్గాల ప్రజల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. 14వ డివజన్‌లో రూ.45 లక్షలు, 15వ డివిజన్లో రూ.45 లక్షలతో చేపట్టిన సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా పింఛన్ గుర్తింపు గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అల్లీపురంలో విశాలమైన వైకుంఠధామాన్ని నిర్మిస్తున్నామని, లోవోల్టేజ్ నివారణ కోసం సబ్ స్టేషన్ మంజూరు చేశామన్నారు. స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టిసారించామని, రానున్న రోజుల్లో మట్టి రోడ్లు, సైడ్‌కాల్వల రహిత డివిజన్‌గా మార్చి చూపిస్తామన్నారు.
తెలంగాణ వచ్చాక దాదాపు రూ.300 కోట్లతో ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు ఇస్తున్నామన్నారు. సుడా నిధులతో ప్రతి డివిజన్‌కు రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.12 కోట్లతో వీడీఎఫ్ రోడ్లను వేస్తామన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 500 మందికి దళితబంధు పథకాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, తెరాస నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్లు రావూరి కరుణ, కూరాకుల వలరాజ్, చామకూరి వెంకన్న, జ్యోతిరెడ్డి, డీఈ ధరణి పాల్గొన్నారు.
ఖమ్మం సెప్టెంబర్ 15 : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన కార్పొరేటర్ పల్లా రోజ్లీనా భర్త పల్లా సల్మాన్ రాజ్, పల్లా జాన్రాములు సతీమణి పల్లా శాంతమ్మ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబసభ్యులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం పరామర్శించి సంతాపం తెలిపారు. ముందుగా కార్పొరేటర్ రోజ్లీనాను పరామర్శించారు. అధైర్య పడొద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. శాంతమ్మ కుమారులు పల్లా రాజశేఖర్, పల్లా కిరణ్‌ను పరామర్శించారు. సల్మాన్‌రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళీ, తెరాస సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.