కూసుమంచి రూరల్, సెప్టెంబర్ 15: 0-19 ఏళ్లలోపు బాలబాలలకు గురువారం ఆల్బెండాజోల్-400 మాత్రలు ఇచ్చారు. డీవార్మింగ్ డేలో భాగంగా నులిపురుగుల నివారణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది మాత్రలను పంపిణీ చేశారు.
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 15: మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎంపీపీ బెల్లం ఉమ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌తో కలిసి చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలు వేశారు.
కూసుమంచి, సెప్టెంబర్ 15: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ చిన్న మోహన్ చిన్నారులకు మందులను పంపిణీ చేశారు.
మధిరటౌన్, సెప్టెంబర్15: మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో 1 – 19 సంవత్సరాల లోపు పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను మింగించారు. హరిజనవాడ హైస్కూల్లో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రలను వేశారు.
చింతకాని, సెప్టెంబర్ 15: మండలంలోని పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య సిబ్బంది ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ తాటికొండ శ్రీకాంత్ అన్నారు. ఎర్రుపాలెం, సెప్టెంబర్ 15: మండల వ్యాప్తంగా 97 శాతం ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ రాజు తెలిపారు.