నెట్వర్క్, నమస్తే తెలంగాణ;పోడుభూములకు పట్టాలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 140 విడుదల చేయడం పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పోడు రైతులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పలు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పోడుభూములకు పట్టాలిస్తామని ప్రకటన చేయడం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ఆదివాసీల ఆరాధ్య దైవమని పేర్కొన్నారు. మరోమారు తాను రైతు పక్షపాతినని నిరూపించుకున్నారని కొనియాడారు.