టేకులపల్లి, సెప్టెంబర్ 13 : పేదల జీవితాలకు ఆసరా పింఛన్ భరోసాగా నిలుస్తున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మంగళవారం టేకులపల్లి మండలం తొమ్మిదో మైలుతండా గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ జర్పుల బిచ్చ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. లబ్ధిదారులు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా రాధ, తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావు, ఎంపీడీవో బాలరాజు, ఎంపీవో గణేశ్ గాంధీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్, జిల్లా నాయకుడు కంభంపాటి చంద్రశేఖర్‌రావు, మార్కెట్ డైరెక్టర్ బానోత్ కిషన్‌నాయక్, సర్పంచులు మాలోత్ సురేందర్, శంకర్‌నాయక్, సరిత, ఎంపీటీసీలు భూక్యా బాలకృష్ణ, చింత శాంతకుమారి, పూన్నెం స్వప్న, టీఆర్ఎస్ నాయకులు చీమల సత్యనారాయణ, భూక్యా సైదులునాయక్, బర్మవత్ శివకృష్ణ, జర్పుల రాజు, ఇస్లావత్ బాలూనాయక్, బానోత్ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.