మణుగూరు టౌన్, సెప్టెంబరు 13 : హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోడు భూముల సమస్యపై జీవో 140 ఇచ్చినందుకు ఆదివాసీ గిరిజనుల తరఫున కేటీఆర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. పినపాక నియోజకవర్గంలోని పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే నియోజకవర్గానికి అధిక నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు రేగా తెలిపారు.