సత్తుపల్లి/ సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 10: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. వజ్రోత్సవ ఏర్పాట్లపై స్థానిక ఎంఆర్ గార్డెన్స్‌లో సంబంధిత అధికారులు, నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16న సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాలలో సమావేశం, అనంతరం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందులో విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గంగారం బెటాలియన్ సిబ్బంది పాల్గొంటారని, అనంతరం సామూహిక సహపంక్తి భోజనాలు చేస్తారని అన్నారు. 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, అదేరోజు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించే సమావేశానికి ఎస్టీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని అన్నారు. 18న నియోజకవర్గ కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో వజ్రోత్సవ స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సూర్యనారాయణ, వెంకటేశ్, సుజాత, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిప్పుకణిక.. చాకలి తఐలమ్మ
తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వేంసూరు రోడ్డులోని దోబీఘాట్ వద్ద శనివారం ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాటం ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, బెల్లంకొండ రాము, టోపీ శ్రీను, కొవ్వూరి వెంకటేశ్వరరావు, పంతంగి సాంబ, విరివాడ నాగభూషణం, మరికంటి సుబ్బారావు, యోగానంద, గుంపర్తి ప్రసాద్, పంతంగి నర్సింహారావు, మందపాటి రవీందర్‌రెడ్డి, అద్దంకి అనిల్, మల్లూరు అంకమరాజు, రాయల కోటేశ్వరరావు, చింతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.