సత్తుపల్లి టౌన్, సెప్టెంబర్ 9 : తెలంగాణ సమాజాన్ని, ప్రజలను తన కవిత్వం, రచనల ద్వారా కాళోజీ చైతన్యవంతం చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. అనంతరం కాళోజీ చేసిన సేవలను కొనియాడారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, కమిషనర్ సుజాత, మహ్మద్ రఫీ, మల్లూరు అంకమరాజు, మందపాటి రవీంద్రారెడ్డి, కౌన్సిలర్ ఫాతిమా గఫూర్ తదితరులు ఉన్నారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా గంగారం 15వ బెటాలియన్లో కమాండెంట్ సయ్యద్ జమీల్పాషా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాకవి కాళోజి జయంతిని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. – నెట్వర్క్