ములకలపల్లి/చండ్రుగొండ/అన్నపురెడ్డిపల్లి, సెప్టెంబరు 4 : పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందించడం జరుగుతున్నదని, ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలోని ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో నూతన పింఛన్ల కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా ములకలపల్లి రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని రైతు వేదికలో పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు, గాలి వానలకు దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు.
ఆ తరువాత చండ్రుగొండ మండలంలోని అయ్యన్నపాలెంలో రైతువేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్ల గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ.. తొలివిడతగా ములకలపల్లి మండలానికి 4468 మందిని అర్హులుగా గుర్తించి పింఛన్లు మంజూరు చేశామన్నారు. నూతన రేషన్‌కార్డుల ప్రక్రియ ఈ నెల నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో స్వయంగా తెలిపారని, ప్రజలకు తన మాటగా చెప్పాలని చెప్పారన్నారు.
లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రం అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. అనంతరం స్వచ్ఛ గురుకుల డ్రైవ్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీవో లక్ష్మయ్య, ఎంపీపీ మట్ల నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణి, ఎంపీటీసీలు మెహరామణి, నూపా సరోజిని, తాటి సునీత, కొర్రి వీరభద్రం, సర్పంచ్‌లు వాడే నాగరాజు, బీబినేని భద్రం, బైటి రాజేశ్, గొల్ల పెంటయ్య, కారం సుధీర్, సున్నం సుశీల, కీసరి శ్రీను, గడ్డం భవానీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, నాయకులు శెనగపాటి అంజి, శెనగపాటి సీతారాములు, పుష్పాల చందర్రావు, ముదిగొండ గోపి, పామర్తి వెంకటేశ్వరరావు, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సునీత, అన్నపురెడ్డిపల్లి మండల ఎంపీపీ సున్నం లలిత, మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తహసీల్దార్ భద్రకాళి, ఎంపీడీవో రేవతి, నాయకులు కొత్తూరి వెంకటేశ్వరరావు, భూపతి నరసింహారావు, నర్సారెడ్డి, నేరళ్ల లాలయ్య, లక్ష్మణరావు, సన్నేపల్లి సుధాకర్‌రావు, వెంకటేశ్వర్లు, చల్లా రాంబాబు, చండ్రుగొండ ఎంపీపీ బానోత్ పార్వతి, ఎంపీటీసీలు దారా వెంకటేశ్వరరావు, లంకా విజయలక్ష్మి, భూక్యా రాజి, సర్పంచ్‌లు బానోత్ కుమారి, కీసరి శాంతమ్మ, కాకా సీత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, చీదెళ్ల పవన్‌కుమార్, గుగులోత్ శ్రీనివాస్‌నాయక్, బానోత్ బీలు పాల్గొన్నారు.