కల్లూరు/ సత్తుపల్లి టౌన్/ తల్లాడ, ఆగస్టు 29: పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాల దృష్ట్యా విత్తన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. నియోజకవర్గ వ్యాప్తంగా మట్టి విత్తన వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కల్లూరులోసర్పంచ్ లక్కినేని నీరజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీ విష్ణు వారియర్‌తో 800 విగ్రహాలను పంపిణీ చేసి మాట్లాడారు.
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం ఇదే వేదికపై ఎనిమిది మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను, నూతన పింఛన్ మంజూరు కార్డులను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కట్టా అజయ్‌బాబు, బీరవల్లి రఘు, పాలెపు రామారావు, బోబోలు లక్ష్మణరావు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, కుమారి, కంభంపాటి వెంకటేశ్వరరావు, పెడకంటి రామకృష్ణ, ఎస్కే కమ్లీ, కాటేపల్లి రజని, ఉబ్బన వెంకటరత్నం, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో..
విత్తన గణపతితో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం వల్ల తొమ్మిది రోజులు పూజలందుకున్న వినాయకుడి విగ్రహం.. నిమజ్జనమైన పది రోజుల తరువాత మొక్కలుగా మొలుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా సోమవారం సత్తుపల్లిలోని అంబేద్కర్ రింగ్సెంటర్లో అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలతతో కలిసి ఎమ్మెల్యే సండ్ర.. ప్రజలకు ఉచితంగా విత్తన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, తోట సుజలారాణి, గాదె సత్యం, కొత్తూరు ప్రభాకర్‌రావు, వనమా వాసు, మట్టా ప్రసాద్, మందపాటి పద్మజ్యోతి, రఫీ, అంకమరాజు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడలో..
పర్యావరణ హితం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తల్లాడలో సోమవారం డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వినాయకుడి విత్తన మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లాడ మండలానికి 600 విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, సూర్యనారాయణ, గంటా శ్రీలత, రవీంద్రరెడ్డి, సురేశ్, జవ్వాజి సుబ్బారావు, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దూపాటి భద్రరాజు, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, తూము శ్రీనివాసరావు, ఓబుల సీతారామిరెడ్డి, శీలం ముత్తారెడ్డి, దగ్గుల రాజశేఖర్‌రెడ్డి, బాణోతు మోహన్ తదితరులు పాల్గొన్నారు.