ఖమ్మం/ రఘునాథపాలెం, ఆగస్టు 29: వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నూతన ‘ఆసరా’ పింఛన్ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం రఘునాథపాలెం, పాండురంగాపురంలో జరిగింది. మంత్రి అజయ్‌కుమార్ హాజరై ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1.75 లక్షల పింఛన్లుండగా కొత్తగా మరో 49,091తో కలిపి ఇప్పుడు 2.24 లక్షలు అయ్యాయని వివరించారు.
కేంద్రం అబద్ధపు ప్రచారం..
ప్రజల సామాజిక భద్రత కోసం ఇస్తున్న ఉచిత పథకాలపై కేంద్రం అబద్ధపు ప్రచారం చేస్తోందని మంత్రి అజయ్ మండిపడ్డారు. తమ అనుకూల మీడియాల ద్వారా ఉచిత పథకాలను నిలిపివేసే కుట్రలకు పూనుకుంటోందన్నారు. కొత్తగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులందరికీ వచ్చే నెల నుంచి వారి ఖాతాల్లో పింఛన్ నగదు జమ అవుతుందని అన్నారు. రఘునాథపాలెం మండలం నూతన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు చెప్పారు. కలెక్టర్ వీపీ గౌతమ్, డీఆర్డీవో, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు భుక్యా గౌరి, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మద్దినేని వెంకటరమణ, వీరూనాయక్, గుడిపుడి శారద, కుర్రా భాస్కర్‌రావు, మందడపు సుధాకర్, మాదంశెట్టి హరిప్రసాద్, గుడిపుడి రామారావు, నున్నా శ్రీనివాసరావు, చెరుకూరి భిక్షమయ్య, తోట వెంకట్, చెరుకూరి ప్రదీప్, మంద సంజీవరావు, బలుసుపాటి నాగేశ్వరరావు, మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, మలీదు వెంకటేశ్వర్లు, నాగండ్ల కోటి, కమర్తపు మురళి, పల్లెబోయిర భారతి, పగడాల నాగరాజు, నర్రా యల్లయ్య, కుర్రా మాధవరావు, చిలుమూరు కోటి, హెచ్ ప్రసాద్, ఫయాజ్, రజీం, మల్లేశం, కోలేటి రాధాకృష్ణ, తొట్టి కొమరయ్య, గుద్దేటి మాధవరావు పాల్గొన్నారు.
పేదలకు ఆర్థిక భరోసా..
ఆసరా పింఛన్లతో పేదలకు భరోసా కలుగుతోందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. నగరంలో నూతనంగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు పింఛన్ కార్డులను సోమవారం ఆయన ఆయా డివిజన్లలో పంపిణీ చేశారు. కలెక్టర్ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పసుమర్తి రామ్మోహన్, పల్లా రోజ్లీనా, మక్బుల్, గోళ్ల వెంకట్ చంద్రకళ, శ్రీదేవి, తోట ఉమారాణి, దోన్వాన్ సరస్వతి, పగడాల శ్రీవిద్య, శ్రీకాంత్, రమ, వెంకట్‌కుమార్, తోట వీరభద్రం, ఉపేందర్, టీఆర్ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు పాల్గొన్నారు.
ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడినే పూజించాలి: అజయ్
ఖమ్మం, ఆగస్టు 28: కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మట్టి గణనాథులను సోమవారం పంపిణీ చేసి మాట్లాడుతూ.. మట్టితో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదని అన్నారు. ముఖ్యంగా నీరు కలుషితమై జలచరాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి, నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, తాజుద్దీన్, కన్నం ప్రసన్నకృష్ణ, బత్తుల మురళి తదితరులు పాల్గొన్నారు.