కల్లూరు రూరల్, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరు మండలంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి అందజేశారు. మండల వ్యాప్తంగా బత్తులపల్లి, కప్పలబంధం, లక్ష్మీపురం, గోకవరం, కొర్లగూడెం, నారాయణపురం, పుల్లయ్యబంజరు, లోకవరం, హనుమతం డా, పాయపూర్ పంచాయతీల్లో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతున్నదన్నారు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్, విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్యంలో ఆసరా, రైతుబంధు, దళితబంధుతో అన్నివర్గాల వారిని ఆదుకునే అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 2.50 లక్షల మంది ఓటర్లకు దాదా పు 1.50 లక్షల మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కల్లూరు మండలంలోనే 1,205 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. 41మందికి కల్యాణలక్ష్మి చెక్కులు,74 మందికి రూ.34.84 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మత విద్వేషాలతో రాజకీయాలు చేయాలని బీజేపీ నేతలు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, వారి ఆటలు ఇక్కడ చెల్లవని పేర్కొన్నారు.
ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, కాటంనేని వెంకటేశ్వరరావు, బోబోలు లక్ష్మణ్‌రావు, నర్వనేని పెద్ద అంజయ్య, సర్పంచులు శీలం సత్యనారాయణరెడ్డి, నందిగం ప్రసాద్, మందపాటి మాధవరెడ్డి, గుగులోతు పెద్ద లచ్చిరాం, బైరెడ్డి నర్సింహారెడ్డి, కొడవాటి శివాజీ, పెద్దబోయిన మల్లేశ్వరరావు, తడికమళ్ల నాగేంద్ర, కల్యాణపు వెంకటేశ్వరరావు, దరావత్ మోహన్‌నాయక్, నాయకులు పెడకంటి రామకృష్ణ, రాచమళ్ల నాగేశ్వరరావు, వల్లభనేని రవి, చల్లగుళ్ల వెంకటేశ్వరరావు, కట్టా అర్లప్ప, బీరవల్లి పురుషోత్తం, ఉబ్బన వెంకటరత్నం, గొల్లమందల ప్రసాద్, నామా వెంకటేశ్వరరావు, కనమతరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, శ్రీరంగం, బొగ్గుల రామిరెడ్డి, మంచాల కృష్ణ, మోర్తాల పిచ్చిరెడ్డి, మేకల కృష్ణ, వేము కృష్ణ తదితరులు పాల్గొన్నారు.