కేంద్రం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు
కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 27: ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆమె ఇంటిపై దాడికి పాల్పడుతున్నారని టీబీజీకేఎస్ కార్పొరేట్ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని సింగరేణి హెడ్డాఫీస్ ఎదుట శనివారం నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. నిరాధారంగా లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాషాయ నేతలు పనిగట్టుకుని టీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు జేబీ మోహన్, మధుసూదన్‌రావు, జాన్సన్ సుధాకర్, వలస కుమార్, రామలక్ష్మణ్‌రెడ్డి, శంకర్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, సురేశ్, పాషా, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, స్వామి, రఘు, ఆనంద్ పాల్గొన్నారు.
మణుగూరు రూరల్, ఆగస్టు 27: టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అసత్య ఆరోపణలు తగదని సంఘం బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా శనివారం మండలంలోని కూనవరంలో నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాషాయ మూకలు పథకం ప్రకారమే దాడి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఆయన కుమార్తెను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అబ్దుల్ రవూఫ్, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, వర్మ, వెంకటేశ్వరరెడ్డి, బానోత్ కృష్ణ, అశోక్, బుర్ర వెంకటేశ్వర్లు, కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, అన్ని గనుల పిట్ సెక్రటరీలు, పిట్ కమిటీ సభ్యులు, ఏరియా ఉద్యోగులు పాల్గొన్నారు.
రుద్రంపూర్ ప్రాంతంలో..
రామవరం, ఆగస్టు 27: రుద్రంపూర్ ప్రగతివనం ఎదుట శనివారం టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎండీ రజాక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ మూకల దాడిని ఖండిస్తున్నామన్నారు. కాషాయ నాయకులు తీరు మార్చుకోకపోతే వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, కూసన వీరభద్రం, గోపు కుమారస్వామి, చిలక రాజయ్య, గౌస్, ఎండీ సత్తార్‌పాషా, శనిగరపు కుమార్, నటరాజ్, సుద్దాల నరసింగం, బి.రవీందర్, ఎం.కేశవరెడ్డి, ఇ.మోహన్‌రెడ్డి, జల్లి కిరణ్, నిమ్మల రాజేశ్వరరావు, గడప రాజయ్య, భీముడు తదితరులు పాల్గొన్నారు.
జేవీఆర్ ఓసీ పరిధిలో..
సత్తుపల్లి రూరల్, ఆగస్టు 27: సత్తుపల్లి సమీపంలోని జేవీఆర్ ఓసీ కార్యాలయం ఎదుట శనివారం పిట్ కార్యదర్శి జేఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో జీఎంల చర్చిల ప్రతినిధి చెన్నకేశవరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులు ఉపేంద్రచారి, వెంకటేశ్వర్లు, క్రాంతి, బరోతు శ్రీనివాసరావు, యూసుఫ్, మున్వర్‌ఖాన్, నరేందర్, కోటి, పొట్టి కిరణ్, నర్సింహారావు, లింగమూర్తి, మజీద్, జగన్నాథం పాల్గొన్నారు.
ఇల్లెందు ఏరియాలో..
ఇల్లెందు, ఆగస్టు 27: టీబీజీకేఎస్ ఇల్లెందు వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ ఆధ్వర్యంలో శనివారం నాయకులు పట్టణంలోని ప్రధాన సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు కుట్ర పన్ని టీబీజేకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. దాడులను సంఘం తిప్పికొడుతుందన్నారు. నిరసనలో నాయకులు ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సంజీవరావు, అశోక్, రవి, నగేశరాజు, సమ్మయ్య, పలేపు సత్యనారాయణ, రామారావు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సత్యం, ఆనంద్, రాజయ్య, శంకర్, రాజేశ్వరరావు, లక్ష్మణ్, కలువల కనకరాజు పాల్గొన్నారు.