మధిరరూరల్, ఆగస్టు 24: విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. మండల పరిధిలోని దెందుకూరు, చిలుకూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పాఠశాలల్లో రికార్డులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ఏ విధంగా అందుతుందో తెలుసుకొని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. అనంతరం మధిరలో జరిగిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన దెందుకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు అదస్థ, ద్వితీయ బహుమతి సాధించిన మానస, ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పీ.రాజేశ్‌ను అభినందించారు. సీసీ మాధవరావు, ఎంఈవో వై.ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు కొండపల్లి నారాయణదాస్, శంకర్రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.