ఖమ్మం రూరల్, ఆగస్టు 22: కస్తూర్బా గాంధీ పాఠశాల, కళాశాలలో సోమవారం స్వత్రంత్ర వజ్రోత్సావ ముగింపు కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థినులు స్వాతంత్య్ర పోరాట నాయకుల వేషాధారాణాతో నాటికలు, నృత్యాలు చేశారు. త్రివర్ణ పతాకంతో జాతీయగీతం ఆలపించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్ ఆయేషా, టీచర్లు సువర్ణ, సరోజీని, స్వాతి, భానుమతి పాల్గొన్నారు.
చింతకాని, ఆగస్టు 22: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు సోమవారం మండల వ్యాప్తంగా ముగిసాయి. చింతకాని ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ హెచ్ఎం కుమ్మర నర్సింహారావు ఆధ్వర్యంలో విద్యార్థులు 75 ఆకారంలో కూర్చుని దేశంపై తమ అభిమానాన్ని, దేశభక్తిని చాటారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, ఆగస్టు 22: మండలంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలను సోమవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ యన్నం సత్యనారాయణరెడ్డి, కళాశాల అభివృద్ధి కమిటీ కార్యదర్శి యన్నం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం, దాని పరిణామాలు వివరించి జాతీయభావనను అందరూ పెంపొందించుకోవాలని కోరారు. వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. క్యాక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మధిరటౌన్, ఆగస్టు 22: మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వజ్రోత్సవాలు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం జయదాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల పేరెంట్స్ కమిటీ బాధ్యులు వనమా వేణుగోపాలరావు, పూర్వవిద్యార్థి చారుగుండ్ల వెంకట లక్ష్మీనర్సింహారావు విద్యార్థులకు పలుసూచనలు చేశారు. అనంతరం వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.