భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)/మామిళ్లగూడెం: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వేడుకలను తిలకించారు. భద్రాద్రి జిల్లా నుంచి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కృష్ణారెడ్డి, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షురాలు కొల్లు పద్మ హాజరయ్యారు. ఖమ్మం జిల్లా నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, అదనపు కలెక్టర్ మధుసూదన్, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఆర్డీవో రవీంద్రనాథ్, జడ్పీ సీఈవో అప్పారావు హాజరయ్యారు.