ములకలపల్లి, ఆగస్టు 22: స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులైన సమరయోధులను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని జడ్పీటీసీ సున్నం నాగమణి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలో భాగంగా ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతిఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శెనగపాటి మెహరామణి, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జీ నర్సింహారావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
చండ్రుగొండ, ఆగస్టు 22: విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించాలని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రతిభ పాఠశాల విద్యార్థులు దేశనాయకుల వేషధారణతో పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఎస్సైతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎస్సైమాట్లాడుతూ…ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలమే స్వాతంత్య్ర ఫలాలు మనం పొందుతున్నామన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆ నాటి త్యాగధనుల ఉద్యమ చరిత్రను తెలపాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబా, పర్వీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
దమ్మపేట, ఆగస్టు 22: దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం ఫ్రీడం కప్ పోటీలు నిర్వహించారు. విజేతలకు వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు బహుమతులు అందజేశారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, హైజంప్ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలందరికీ బహుమతులు అందచేశారు. పాఠశాలకు ఎస్సై శ్రావణ్‌కుమార్ డీజే స్పాన్సర్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉయ్యాల చిన్నవెంకటేశ్వరరావు, ఎంఈవో కీసరి లక్ష్మి, ఎస్ఎంసీ చైర్మన్ పాకనాటి శ్రీనివాసరావు, హెచ్ఎం మస్తాన్‌వలీ, యార్లగడ్డ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో దమ్మపేట మండలంలోని నాచారం పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎల్ శ్రీలక్ష్మి జిల్లా స్థాయి బహుమతి సాధించింది. పాఠశాలలో నిర్వహించిన సభలో హెచ్ఎం ఆర్ పద్మావతి, ఉపాధ్యాయులు శ్రీలక్ష్మిని అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలన్నారు.
ఇల్లెందు, ఆగస్టు 22: పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు సోమవారం జరిగాయి. 16వ వార్డు కౌన్సిలర్ గిన్నారపు రజిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొన్న మహనీయులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. క్రీడలు, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామలింగేశ్వరరావు, ఇన్చార్జి భానుప్రసాద్, లైబ్రేరియన్ ఖాసీం, జాన్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లెందు పట్టణంలోని మార్గదర్శిని హైస్కూల్లో వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆర్వపల్లి రాధాకృష్ణ, యాదగిరి రాంబాబు, ఉపాధ్యాయులు కంది గోపి, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు, నాగరాజు, వీరన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, ఆగస్టు 22: మండల వ్యాప్తంగా వజ్రోత్సవ ముగింపు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు, మహిళలు, యువత పాల్గొని భారతదేశ ఔనత్యాన్ని చాటారు.