మామిళ్లగూడెం, ఆగస్టు 3 : పలు కారణాలతో ఇళ్ల నుంచి తప్పిపోయి, పారిపోయి పరిశ్రమల్లో వెట్టి చాకిరీ చేస్తున్న 127 మంది చిన్నారులను గుర్తించి రక్షిత గృహాలకు, తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ బుధవారం తెలిపారు. నిరాదరణకు గురవుతున్న పిల్లలను గుర్తించి, సంరక్షించే లక్ష్యంతో పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, కార్మికశాఖల ఆధ్వర్యంలో జూలైలో ఆపరేషన్ ముసాన్ నిర్వహించామని, జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో ముసాన్-8 కార్యక్రమం ద్వారా 99 మంది బాలలు, 28 బాలికలను గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో 48 ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసుల్లో 48 మందిని నిందితులుగా చేర్చారని తెలిపారు. దొరికిన చిన్నారుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 22 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.
బాధిత కుటుంబానికి ఎక్సిగ్రేషియా అందజేత
అనారోగ్యంతో మరణించిన కూసుమంచి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వి.వెంకయ్య కుటుంబ సభ్యులకు శాఖా పరమైన భద్రత ఎక్స్గ్రేషియా నుంచి రూ.4లక్షల చెకును పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.