మామిళ్లగూడెం, ఆగస్టు 3: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా మూడేళ్లు పూర్తి చేసుకోవడంతో చాలా ఆనందంగా ఉందని లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. ఖమ్మంలోని డీపీఆర్సీ భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో జడ్పీటీసీలతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజన అనంతరం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని అన్నారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో ఖమ్మం జడ్పీ చైర్మన్‌గా తాను బాధ్యతలు చేపట్టి గ్రామస్థాయి నుంచీ అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.
2019-20లో జడ్పీ సాధారణ నిధుల ద్వారా జిల్లాలో 52 పనులను రూ.1.91 కోట్లతో పూర్తి చేశామన్నారు. 2020-21లో ఇవే నిధులతో 9 పనులను రూ.2.80 కోట్లతోనూ, 2021-22లో 54 పనులను రూ.2.13 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టినట్లు వివరించారు. ఇంకా వివిధ రకాల నిధులతో ఆయా పనులను చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తిచేసి 42 మందికి పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. అధికారులకు ఉద్యోగున్నతులు కల్పించి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సహకారంతో మధిర పట్టణంలో 100 బెడ్ల హాస్పిటల్ మంజూరు చేయించామన్నారు.
అలాగే, అంబారుపేట ట్యాంక్‌బండ్‌కు రూ.5.7 కోట్లు, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు రూ.4.50 కోట్లు, వైకుంఠధామం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు వివరిం చారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో కరోనా సమయంలో ప్రజలకు ఎంతో మెరుగైనా సేవలు అదించామన్నారు. ప్రభుత్వం ద్వారా ఆక్సీజన్ ప్లాంట్, 350 బెడ్ల పెంపు, యూరాలజీ, కార్డియాలజీ సేవలతో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇంకా రెండేళ్ల పదవీకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పీటీసీలు వరప్రసాద్, నంబూరి కనకదుర్గ, పోట్ల కవిత, శీలం కవిత, జగన్, రామారావు, సుమలత, అజయ్‌కుమార్, రామ్మోహన్రావు, బెల్లం శ్రీను, తిరుపతి కిశోర్, ప్రమీల, బేబి, దుర్గ, సుధీర్‌బాబు, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, మీరా తదితరులు పాల్గొన్నారు.