చింతకాని, జూలై 25: సీఎం కేసీఆర్‌తోనే దళిత సాధికారత సాధ్యమని, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితుల దిశ మారుతున్నదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. మండలంలోని నాగులవంచ గ్రామంలో 10 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన జేసీబీలు, హార్వెస్టర్లు, కిరాణా దుకాణాలను సోమవారం ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలం ఎంపికై అన్ని గ్రామాల్లోని దళితులకూ ఫలాలు అందుతుండడంతో దళితవాడలన్నీ కళకళలాడుతున్నాయని అన్నారు. దళితుల కోసం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసి చూపిస్తున్నారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఇనుకుళ్ల బ్రహ్మారెడ్డి, పర్చగాని తిరుపతి కిశోర్, గురజాల హనుమంతరావు, పూర్ణయ్య, వంకాయలపాటి వెంకటలచ్చయ్య, పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, నల్లమోతు శేషగిరి, బొడ్డు వెంకట్రామయ్య, పరిటాల యలమంద, బంధం కృష్ణ, అంగిడి సుధాకర్, నారపోగు నాగయ్య, ఆళ్ల అజయ్, సిలివేరు సైదులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..
మండలంలోని నాగులవంచ గ్రామానికి చెందిన ఎస్.శ్రీనివాసరావుకు మంజూరైన రూ.40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును జడ్పీ చైర్మన్ పంపిణీ చేశారు.