నెట్వర్క్ ;యువనేతటీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, నాయకులు, అభిమానులు కేక్‌లు కోసి సంబురాలు నిర్వహించారు.. వీధుల్లో పటాకులు కాల్చారు.. ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.. గోదావరి ముంపు ప్రాంతాల్లో ముంపుప్రాంత వాసులకు నిత్యావసర సరుకులు అందజేశారు.. రక్తశిబిరాలు నిర్వహించి రక్తదానం చేశారు..
యువనేత, టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఆదివారం ఉమ్మడి జిల్లాలో మిన్నంటాయి.. టీఆర్ఎస్ కార్యాలయాల్లో సందడి నెలకొన్నది.. అభిమానులు, కార్యకర్తలు, నేతలు వీధుల్లో పటాకులు కాలుస్తూ .. కేక్‌లు కోస్తూ సంబురాలు నిర్వహించారు.. ‘గిఫ్ట్ ఎ స్మైల్’లో భాగంగా ఆస్పత్రుల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు.. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.. గోదావరి ముంపు ప్రాంతాల్లో ముంపుప్రాంత వాసులకు నిత్యావసర సరుకులు అందజేశారు.. రక్త శిబిరాలు నిర్వహించి రక్తదానం చేశారు.. నిరుపేదలకు అన్నదానం చేశారు.. యువనేత చొరవతోనే రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు పెరిగాయని, ఆయన విజన్‌తోనే పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయని వక్తలు కొనియాడారు.