నెట్వర్క్;శివసత్తుల నాట్య విన్యాసాలు, డప్పు దరువుల నడుమ ఆదివారం పల్లెజనం బోనమెత్తారు. పలు గ్రామాల్లో పండుగ వాతావరణం సంతరించుకున్నది. మహిళలు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనమెత్తి ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు. ‘చల్లంగ చూడు తల్లీ’ అంటూ వేడుకున్నారు. ఆషాఢబోనాలతో పల్లెల్లో భక్తిపారవశ్యం వెల్లివిరిసింది.
బోనం నీకు సమర్పిస్తాం.. భోగ భాగ్యాలు మాకివ్వు తల్లీ..’ అంటూ ఆదివారం ఉమ్మడి జిల్లాలో భక్తులు గ్రామదేవతలకు బోనమెత్తారు.. ‘వరాలీయమ్మా..’ అంటూ మొక్కులు తీర్చుకున్నారు.. శివసత్తుల నాట్య విన్యాసాలు, డప్పు విన్యాసాల నడుమ ఊరేగింపులు హోరెత్తాయి.. దీంతో గ్రామగ్రామాన భక్తిపారవశ్యం వెల్లివిరిసింది.