బూర్గంపహాడ్, జూలై 24: వరద బాధితులకు ఐటీసీ సహకారం అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో ఐటీసీ ఆధ్వర్యంలో సుమారు 2500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ఐటీసీ యాజమాన్యం కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సర్పంచ్ సిరిపురం స్వప్న, నాయకులు రామకొండారెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, ఐటీసీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు కనకమేడల హరిప్రసాద్, జీఆర్‌కె.రెడ్డి, శంకర్‌రెడ్డి, సతీశ్, రమేశ్, సాబీర్‌పాషా, రవి, గంగరాజు, మహేశ్, మందాప్రసాద్, సర్వేశ్వరరావు, సాంబ, రవి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
‘తాళ్లూరి ట్రస్టు’ ఆధ్వర్యంలో..
సారపాక, జూలై 24 : తాళ్లూరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఇరవెండి, మోతే పట్టీనగర్ పంచాయతీల్లో 600 కుటుంబాలకు చెందిన గోదావరి వరద బాధితులకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. తాళ్లూరి పంచాక్షరయ్య, జడ్పీటీసీ శ్రీలత రామకొండారెడ్డి, శ్రీనివాసరావు, ట్రస్టు డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, జలగం జగదీశ్, సర్పంచ్‌లు లక్ష్మి, సూరమ్మ, రామలక్ష్మి, నాయకులు రవికుమార్, ప్రసాద్, తాళ్లూరి రాధాకృష్ణ పాల్గొన్నారు