అశ్వాపురం, జూలై 23 : నెల్లిపాక గ్రామపంచాయతీలో గోదావరి వరద ముంపునకు గురైన 200 కుటుంబాలకు శనివారం తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ప్రభుత్వం ద్వారా రూ.10 వేలు ఆర్థికసాయం, రెండు నెలల పాటు 25 కిలోల బియ్యం, పలు నిత్యావసర సరుకులు అందించనున్నట్లు చెప్పారు. ముంపువాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.
నెల్లిపాక బంజర, నెల్లిపాక, టేకులగుట్ట గ్రామాల్లో ముంపు కుటుంబాలకు ఎత్తైన స్థలాల్లో ప్రభుత్వ సహకారంతో కాలనీలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నదన్నారు. గోదావరి వరదలో పూర్తిగా దెబ్బతిన్న పలు ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్‌కుమార్, వైస్‌ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సర్పంచ్‌లు గొర్రెముచ్చు వెంకటరమణ, మర్రి మల్లారెడ్డి, పాయం భద్రయ్య, ఎంపీటీసీలు గాదె జయ, కందుల దుర్గాభవాని, తాటి పూజిత, టీఆర్ఎస్ నాయకులు కోడి అమరేందర్, జాలె రామకృష్ణారెడ్డి, కందుల కృష్ణార్జునరావు, కొల్లు మల్లారెడ్డి, చిలకా వెంకట్రామయ్య, గొర్రెముచ్చు వెంకటరమణ, గద్దల రామకృష్ణ, నయీమ్, కొర్సా దుర్గారావు, గడకారి భాస్కర్, సంసోన్, మండ్రు రామకృష్ణ, కనకమేడల కోటేశ్వరరావు, బెల్లం వెంకటేశ్వరరావు, గాదె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.