ముదిగొండ/ నేలకొండపల్లి, జూలై 23: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ముందుండాలని నార్త్ జోన్ అడిషనల్ డీజీపీ వై. నాగిరెడ్డి అన్నారు. ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఆవుల భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అందిస్తున్న ఆవుల అమ్మిరెడ్డి స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమంలో శనివారం ఆ యన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు మనిషికి గౌరవం, హోదాతోపాటు సంస్కారాన్ని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, ఎంఈవో రామాచారి, ఎస్సై తోట నాగరాజు, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలపట్ల జాగ్రత్తగా ఉండాలి
రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటి నివారణకు పోలీసులు చర్యలు చేపట్టాలని అదనపు డీజీపీ నాగిరెడ్డి అన్నారు. నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ పెరుగుతున్నందున రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఫంక్షనల్ వర్టికల్స్, 5ఎస్ అమలుపై మరింత దృష్టి సారించాలన్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్, ఏసీపీ బస్వారెడ్డి, సీఐ సతీశ్, ఎస్సై స్రవంతి పాల్గొన్నారు.