కూసుమంచి, జూలై 23: దళితోద్ధరణ కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంతో దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అన్నారు. ఈ పథకం రాబోయే రోజుల్లో మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన 75 మందికి మంజూరైన దళితబంధు యూనిట్లను కూసుమంచిలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా పేదరికంలో ఉండి రోజు వారీ కూలి పనులు పోయిన మీరంతా ఇక నుంచి యజమానులు అయ్యారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మద్యానికి బానిసలు కావద్దని, పిల్లలను బాగా చదివించాలని సూచించారు.
తరతరాలుగా వెలివేయబడిన దళితులను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందిస్తున్న ఈ యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అదనపు కలెక్టర్ స్నేహలతా మొగిలి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు మరికంటి ధనలక్ష్మి, దశరథం, ఏలూరి శ్రీనివాసరావు, ఇంటూరి శేఖర్, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బాణోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, వరప్రసాద్, నెల్లూరి లీలా ప్రసాద్, సేట్రాంనాయక్, వాసంశెట్టి వెంకటేశ్వర్లు, నలబోలు చంద్రారెడ్డి, చావా వేణు, వేముల వీరయ్య, ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు, పాషబోయిన వీరన్న, కరుణాకర్‌రెడ్డి, జయరాం, మీనన్, మోదుగు వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.