
సత్తుపల్లి రూరల్, నవంబర్ 18 : కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు ఆలయాల్లో మహిళలు గురువారం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. కాకర్లపల్లి, బేతుపల్లి, గంగారం బెటాలియన్, సదాశివునిపాలెం, బుగ్గపాడు శివాలయాలతో పాటు పట్టణంలోని గుడిపాడురోడ్, వెంగళరావునగర్ ఆలయాల్లో మహిళలు అధిక సంఖ్యలో దీపాలను వెలిగించారు. అనంతరం ఆకాశదీపం, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. కాకర్లపల్లి శివాలయంలో ఆలయకమిటీ అధ్యక్షుడు కిలారు వెంకటేశ్వరరావు జ్వాలాతోరణం వెలిగించారు. ఆలయ ధర్మకర్త, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, కంచర్ల బాబూరావు, బేతిని శ్రీనివాసరావు, ఈడ్పుగంటి సుబ్బారావు, ఆలయ అర్చకులు పవన్‌కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ, నవంబర్18 : కార్తీకపౌర్ణమి వేడుకలను గురువారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో దీపాలు వెలిగించారు. తల్లాడ, అన్నారుగూడెం, నూతనకల్, కుర్నవల్లి, నారాయణపురం, గ్రామాల్లోని శివాలయాలు, రామాలయాలు, వెంకటేశ్వరస్వామి, అయ్యప్పస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
కామేపల్లి, నవంబర్ 18 : రామకృష్ణాపురంలోని సువర్చల సహిత అభయాంజనేయస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గురువారం 1008 దీపాలను వెలిగించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆవధూతేంద్ర భక్త మండలి ఆధ్వర్వంలో భక్తులు రామనామ ఏకావహం కార్యక్రమం నిర్వహించారు.