మణుగూరు టౌన్, జూలై 12: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మణుగూరు సమితి సింగారం పంచాయతీలోని అశోక్‌నగర్ ముంపు ప్రాంతాలను రేగా, ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం పరిశీలించారు. జేసీబీ సహాయంతో కాలువలు ఏర్పాటు చేసి వరదనీటిని బయటకు పంపారు. సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.25లక్షలు కేటాయించేలా నిర్ణయించారు. ఆయన వెంట వార్డుసభ్యులు బర్మావత్ నర్సింహారావు, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు, టీఆర్ఎస్ నాయకులు హర్ష, ఆవుల నర్సింహారావు, మేకల రవి, బొమ్మ రాత్రి ఎల్లయ్య, తిరుపతి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు హరికృష్ణ ఉన్నారు.
వరద బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్
వరద బాధితులకు ప్రభు త్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. గోదావరి, కిన్నెరసాని వరద ఉధృతికి ముంపు ప్రాంతాల్లో నీరు చేరడంతో ముంపు బాధితులను అధికారులు సోమ, మంగళవారాలు మార్కెట్ యార్డుకు తరలించారు. కలెక్టర్ పునరావాస కేంద్రాన్ని మంగళవారం సందర్శించి ముంపు బాధితులతో మాట్లాడి సహాయక చర్యలను తహసీల్దార్ భగవాన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, పీఆర్ ఏఈ వెంకటేశ్వరరావు, సర్పంచ్ సిరిపురం స్వప్న, ఎంపీడీవో వివేక్‌రామ్, ఎంపీవో సునీల్‌శర్మ, ఎస్సై జీవన్‌రాజు ఉన్నారు.
వరద బాధితులకు అండగా టీఆర్ఎస్
గోదావరి వరదల్లో ముంపునకు గురైన వరద బాధితులకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మంగళవారం ముంపు ప్రాంతాల్లో వారు పర్యటించి వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు. మంగువాయిబాడువ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి వరద బాధితులతో మాట్లాడారు.
వరదబాధితులకు దుప్పట్లు పంపిణీ…
ముంపు బాధితులను టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీత మ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు అన్నెం సత్యనారాయణమూర్తి, కణితి రాముడు, ఎంపీటీసీ రామారావు, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు, జయసింహ, శ్రీధర్, అనిల్, అర్జున్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, వైద్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
నీటిముంపులో నారచీరెల ప్రాంతం..
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుం చి వరద ప్రవాహం గోదావరిలోకి రావడంతో పర్ణశాల వద్ద నారచీరెల ప్రాంతం మూడు రోజులుగా నీటిముంపులోనే ఉన్నది. మంగళవారం గోదావరి ప్రవాహం తగ్గకపోవడంతో నీటిముంపులో నారచీరెల ప్రాంతం ఉంది.