పెనుబల్లి, జూలై 12 : అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా లబ్ధిదారులకు నేరుగా యూనిట్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన వందశాతం యూనిట్లను మంగళవారం ఆయన కలెక్టర్ వీ పీ గౌతమ్‌తో కలిసి అందజేసి మాట్లాడారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. విద్య, వైద్య రంగాలపై దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా పాలిస్తున్న ఏకైక ప్రభుత్వమని పేర్కొన్నారు. యూనిట్లు అందుకున్న లబ్ధిదారులు ఆదర్శంగా నిలవాలని, జిల్లా మొత్తం కారాయిగూడేన్ని ఆదర్శంగా తీసుకునేలా నడుపుకోవాలన్నారు.
పరిమితి లేని పథకం : కలెక్టర్
దళితబంధు పథకం పరిమితులు లేని పథకమని కలెక్టర్ వీ పీ గౌతమ్ అన్నారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా ప్రతి లబ్ధిదారుడు యూనిట్లపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, మండల ప్రత్యేకాధికారి నాగరాజు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మీ, డీటీవో కిషన్‌రావు, సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి, పాతకారాయిగూడెం సొసైటీ చైర్మన్ చింతనిప్పు సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకటరావు, భూక్యా ప్రసాద్, నీలాద్రి చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నాటిన మొక్కలను బతికించాలి : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చూడాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం హరితహారం ప్రారంభంలో భాగంగా వీఎం బంజరు ఎన్సెస్పీ కాలువ కట్టపై మొక్కలు నాటి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు హరితహారం ఏర్పాటు చేశారన్నారు. నాటిన మొక్కలను బతికేలా చొరవ చూపాలని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాచందన, ఇరిగేషన్ సీఈ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మినీ స్టేడియం పనుల పరిశీలన
కల్లూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రూ.3.40కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియం నిర్మాణ పనులను కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. కల్లూరులో బస్టాండ్ నిర్మాణ పనులకు సంబంధించి కలెక్టర్, ఎమ్మెల్యేలు మంగళవారం పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యార్ధం బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తిచేసి త్వరితగతిన ప్రయాణీకులకు అందుబాటులోకి తెచ్చినందుకు సర్పంచ్ లక్కినేని నీరజ రఘు, అధికారులను కలెక్టర్ అభినందించారు.
ఎస్సీ వసతిగృహాన్ని పరిశీలించిన కలెక్టర్ : పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ను కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో వార్డెన్ అందుబాటులో లేడు. వసతిగృహాల జిల్లా అధికారికి కలెక్టర్ ఫోన్ చేసి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సీహెచ్.సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపీడీవో రవికుమార్, ఏసీపీ వెంకటేశ్, పీఆర్‌జేఈ వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ హేమలత, డీఈ శంకర్రావు, జడ్పీటీసీ కట్టా అజయ్‌బాబు, రైతుబంధు సమితి మండల సభ్యుడు లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.