ఖమ్మం, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి.. చెరువులు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి.. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యా ప్తంగా 51.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 93.8 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరాసరి 59.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కొత్తగూడెం మండలంలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టేకులపల్లి మండలంలో వాగులు పొంగి కొప్పురాయి- ఒడ్డుగూడెం, వీఆర్ బంజర, గోవింద్రాల, లలితాపురం, మాటూరుపేట, పైనంపల్లి గ్రామాల్లో కాజ్‌వేలపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచి పోయాయి. రాత్రి 10 గంటల సమయానికి భద్రచలం వద్ద గోదారి నీటి మట్టం 41.5 అడుగులకు చేరింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి.. చెరవులు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి.. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 51.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వేంసూరు మండలంలో 93.8 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరాసరి 59.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కొత్తగూడెం మండలంలో 100 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి టేకులపల్లి మండలంలో వాగులు పొంగి కొప్పురాయి- ఒడ్డుగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా పరిధిలోని వీఆర్ బంజర, గోవింద్రాల, లలితాపురం, మాటూరుపేట, పైనంపల్లి గ్రామాలో క్యాజ్వేలపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాజెక్టులు, నదుల వివరాలు..
భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఆదివారం రాత్రి 10 గంటలకు గోదావరి నీటిమట్టం 41.50 అడుగులకు చేరింది. 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెదవాగు ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరింది. అధికారులు ప్రాజెక్టుకు ఉన్న మూడు గేట్లను ఎత్తి వరద నీటిని కిందికి వదిలారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు అధికారులు 16 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తి నిల్వసామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం 18.5 అడుగులకు నీటిమట్టం చేరింది.
వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 19.4 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు నీరు అధికంగా ఉండడంతో మిగిలిన నీరు అలుగుల ద్వారా వైరా నదిలోకి ప్రవహిస్తున్నది. పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 402.60 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 21 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 21 వేల క్యూసెక్కులు ఉంది. వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో ఉభయ జిల్లాల్లో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2.30 లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభమైంది.