పెనుబల్లి, జూన్ 28: రైతుబంధుతో వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర రైతులకు పంటల పెట్టుబడి సాయంగా రూ.58 వేల కోట్ల రైతుబంధు నిధులను వెచ్చించిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందని అన్నారు. మంగళవారం నుంచి 9వ విడత రైతుబంధు నిధుల రైతుల ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో మండల కేంద్రమైన పెనుబల్లిలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ కటౌట్‌కు క్షీరాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతుబంధు పథకం తెలంగాణలోని అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉంటోందని అన్నారు. ఇంకా అనేక పథకాలతో కర్షకులను ఆదుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కనగాల వెంకటరావు, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, చింతనిప్పు సత్యనారాయణ, ముక్కర భూపాల్‌రెడ్డి, అప్పారావు, తావునాయక్, చీపి లక్ష్మీకాంతం, భూక్యా పంతులి, కాకా సీతారాములు, వంగా పండు, వంగా ఝాన్సీ, బాణోతు ఛత్రియా, తేళ్లూరి నాగేశ్వరరావు, రాయపూడి మల్లయ్య పాల్గొన్నారు.