భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 24 (నమస్తే తెలంగాణ): నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్దేనని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కొత్తగూడెం రైటర్బస్తీలో నూతనంగా ఏర్పాటుచేసిన విప్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, గడపగడపకూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వివరించారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ హరిసింగ్నాయక్, జడ్పీటీసీలు పోశం నరసింహారావు, వాంకుడోత్ ఉమాదేవి, కళావతి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు దేశానికే ఆదర్శం
అశ్వాపురం, జూన్ 24: దళితబంధు పథకం దేశానికి ఆదర్శమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. కొత్తగూడెంలో శుక్రవారం ప్రారంభించిన ప్రభుత్వ విప్ కార్యాలయం వద్ద అశ్వాపురం మండలానికి చెందిన దళితబంధు లబ్ధిదారుడు వెంకటరమణకు బొలెరో వాహనాన్ని పంపిణీ చేశారు.