మామిళ్లగూడెం, జూన్ 21 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఖమ్మం నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు. యోగా వల్ల మనిషి శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతాడ న్నారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఆర్ఐలు పాల్గొన్నారు.
దినచర్యలో యోగా భాగం కావాలి : ఎంపీ నామా
ప్రతిఒక్కరి దినచర్యలో యోగా భాగం కావాలని ఎంపీ నామా నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో యోగా చాలా అవసరమన్నారు.
ఆరోగ్యానికి యోగా అవసరం : జిల్లా జడ్జి
ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి యోగా అవసరమని జిల్లా ప్రధాన జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అబ్దుల్ జావీద్‌పాషా, గొల్లపూడి రామారావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
వర్తక సంఘం ఆధ్వర్యంలో..
వర్తకసంఘం కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి గొడవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, గౌరవాధ్యక్షుడు కొప్పు నరేశ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పీవీసీ రావు హాజరయ్యారు.
రఘునాథపాలెం మండలంలో..
ఖమ్మం నగరం బల్లేపల్లిలోని బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్లో విద్యార్థులకు చైర్మన్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి యోగా విశిష్టతను వివరించారు. కరస్పాండెంట్ పి.అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కోయచలకలో యోగా గురువు రవికుమార్‌తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఉపసర్పంచ్ పూర్ణచందర్రావు, గ్రామపెద్దలు హనుమంతరావు, బ్రహ్మం పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో…
నగరంలోని విద్యాసంస్థల్లో యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాలు వేసి అలరించారు. బొమ్మ విద్యాసంస్థల్లో చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ సత్యప్రసాద్, హార్వెస్ట్‌లో ప్రిన్సిపాల్ పార్వతీరెడ్డి, కరస్పాండెంట్ రవిమారుత్, స్మార్ట్కిడ్జ్లో కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, గీతాంజలి పాఠశాలలో డైరెక్టర్స్ టీవీ అప్పారావు, పద్మ, నిర్మల్ హృదయ్ స్కూల్లో సాంబశివారెడ్డి, ప్రిన్సిపాల్ పద్మజారెడ్డి, త్రివేణి పాఠశాలలో డైరెక్టర్ వీరేంద్రచౌదరి, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, విన్ఫీల్డ్ స్కూల్లో డైరెక్టర్స్ గద్దె పుల్లారావు, మన్నె కిశోర్‌కుమార్, పోలవరపు శ్రీకాంత్, ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ విజయకుమారి పాల్గొన్నారు.