మధిర టౌన్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వర్ధంతిని స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. పలువురు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పార్టీ పట్టణ, మండల కార్యదర్శులు అరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు, నాయకులు కూన నరేందర్‌రెడ్డి, ముత్తవరపు ప్యారీ, యర్రగుంట రమేశ్, జిల్లేపల్లి బాబురావు, ఆళ్ల నాగబాబు, జేవీ రెడ్డి, గద్దల రాజా, జగన్నాధచారి, రమేశ్, ఖాదర్, రాంబాబు పాల్గొన్నారు.
ఎర్రుపాలెంలో..
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని టీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు నిర్వహించారు. తొలుత జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచ్ అప్పారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకులు కొండేపాటి సాంబశివరావు, శీలం ఉమామహేశ్వరి, పాలశెట్టి తిరుపతిరావు, గుర్రాల పుల్లారెడ్డి, బొర్రా నారాయణ, కర్నాటి శ్రీనివాసరెడ్డి, దేవరకొండ రవి, భాస్కర్, చిన్నం రాము, కొల్లి శ్రీను, రామిరెడ్డి, కోట రవి, సురేశ్, సుధీర్ పాల్గొన్నారు.
బోనకల్లులో..
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరు కృషిచేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరావు, మోదుగుల నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, పారా ప్రసాద్, యనిగండ్ల మురళీ, కొమ్మినేని ఉపేందర్, కొనకంచి నాగరాజు, గద్దల వెంకటేశ్వర్లు, షేక్ నజీర్, షేక్ సైదా, సూర్యదేవర సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో..
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా నేలకొండపల్లిలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.