సత్తుపల్లి, జూన్ 20: పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే దాతలు, ప్రజల భాగస్వామ్యం ఉండాలని అప్పుడే పాఠశాలలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని పాఠశాలల రాష్ట్ర పరిశీలకుడు ఎస్కే సైదులు అన్నారు. సోమవారం మండలంలోని గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. స్వచ్ఛ విద్యాలయ పురస్కారంలో భాగంగా జిల్లాలో మొత్తం 14 పాఠశాలలు ఎంపిక కాగా వాటిలో ఎంపికైన ఈ రెండు పాఠశాలలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో రాములు, మైనార్టీ స్కూల్ హెచ్ఎం కత్తి వెంకటరావు, హెచ్ఎం శైలకుమారి, కాంప్లెక్స్ సీఆర్పీ బాలరాజు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
పెనుబల్లిలో..
పెనుబల్లి, జూన్ 20: మండలంలోని చింతగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఎంపికైందని హెచ్ఎం పీఎల్టీఏ మంగతాయారు తెలిపారు. సోమవారం రాష్ట్ర పరిశీలకుడు ఎస్కే సైదులు పాఠశాల పరిసరాలను, శౌచాలయాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, సీఆర్పీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.
కల్లూరు రూరల్..
కల్లూరు రూరల్, జూన్ 20: మండలంలోని చిన్నకోరుకొండి పాఠశాలను స్వచ్ఛ విద్యాలయ పురస్కారంలో భాగంగా రాష్ట్ర పరిశీలకుడు ఎస్కే సైదులు సోమవారం సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, మరుగుదొడ్లు, సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థుల మరుగుదొడ్లు, డిజిటల్ తరగతి గదిని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జి హెచ్ఎం పీవీవీ సత్యనారాయణరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ కృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.