కారేపల్లి, జూన్ 20: మండలంలోని తెలంగాణ మోడల్ పాఠశాలను వరంగల్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజినిదేవి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కొవిడ్ కారణంగా ప్రత్యక్ష విద్యాబోధనకు అంతరాయం కలిగిందని, ఈ విద్యాసంవత్సరంలో నిర్ణీత సమయానికి పాఠశాలలు పునః ప్రారంభించామని అన్నారు. విద్యార్థుల చదువుల పట్ల ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆరో తరగతి ప్రవేశాల గురించి ప్రిన్సిపాల్ ఎండీ అక్తర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు. నాణ్యమైన విద్యాబోధనపై ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇన్చార్జి ఎంఈవో జయరాజు తదితరులు పాల్గొన్నారు.