చర్ల, జూన్ 15: చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాల వారు బుధవారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు లింగాపురంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ను గెలిపించి తప్పుచేశారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఆదరించి అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం రాజారావు, నక్కినబోయిన శ్రీనివాస యాదవ్, నాయకులు కొటేరు శ్రీనివాసరెడ్డి, అరవింద్, మొహబూబ్, లంకరాజు, దొడ్డి తాతారావు పాల్గొన్నారు.